Back
Home » విహారం
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
Native Planet | 26th Aug, 2019 04:56 PM
 • సందర్శనకు మొదటి స్థానంలో మధ్యప్రదేశ్‌లోని మాండూ

  మాండూ వర్షాలు పడే సమయంలో ఏ ప్రాంతాలు సందర్శనకు అనువుగా ఉంటాయో చెక్‌ చేస్తే అందులో మొదటి స్థానంలో ఉంటుందీ మాండూ. మధ్యప్రదేశ్‌లోని ఈ ప్రాంతంలో ఆప్ఘన్‌ శైలి నిర్మాణాలు, చారిత్రక ప్రదేశాలు ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఆకర్షణీయమైన ప్రదేశాలు జహాజ్‌ మహల్‌, రాణీ రూపమతి పెవిలియన్‌, రాజ్‌ బహదూర్‌ ప్యాలెస్‌, జామీ మసీద్‌, హోషంగ్‌ టూంబ్‌, హిండోలా మహల్‌, జైన్‌ టెంపుల్‌, ఆష్రఫి మహల్‌.


 • మండు పట్టణం చాలా వరకు చరిత్ర ప్రసిద్ధ ప్రకృతి ప్రదేశాలు

  మండు పట్టణం చాలా వరకు చరిత్ర ప్రసిద్ధ ప్రకృతి ప్రదేశాలు కలిగి వుంటుంది. టవున్ యొక్క గోడలు అద్భుత శిల్ప శైలి కలిగి వుంటాయి. ఎన్నో మసీదులు,మహళ్ళు అన్నీ కూడా గత చరిత్రను పునరుద్ధరిస్తాయి. ఇక్కడ చూడవలసిన వాటిలో రూపమతి మహల్, అద్భుత దర్వాజాలు, కోట యొక్క గేటు లు, తాజ్ మహల్ వలే మార్బుల్ తో నిండిన హోశాంగ్ టూమ్బ్ మొదలైనవి.


 • రూపమతి మహల్ ఈ ప్రదేశం మనసులు కరిగించే గాధ.

  రూపమతి మహల్ ఈ ప్రదేశం మనసులు కరిగించే గాధ. రాణి రూపమతి మరియు బాజ్ బహదూర్ ల ప్రేమ కధ. ఈ ప్రేమ కథలో కులం, మతం ప్రపంచ బంధాలు ఏమీ వుండవు. పూర్తిగా వారి ప్రేమ , త్యాగాలకు సంబంధించినది. వీరి ప్రేమ కధ వివిధ రకాలుగా చెపుతారు. వాస్తవం మాత్రం నేటికి తెలియదు. ఈప్రదేశం నుండి రాణి రూపమతి తన ప్రియుడి భవనాన్ని, తనకు ఎంతో ఇష్టమైన నర్మదా నదిని చూసేదని చెపుతారు.


 • ఈ ప్లేస్ నుండి కనపడే ప్రకృతి దృశ్యాలు ప్రేమ అన్నింటిని జయిస్తుంది

  ఈ ప్లేస్ నుండి కనపడే ప్రకృతి దృశ్యాలు ప్రేమ అన్నింటిని జయిస్తుంది అనే అర్ధం చెపుతాయి. పాలస్ సమీపంలో ఒక ఎకో పాయింట్ కలదు. పాలస్ నుండి సూర్యాస్తమయ దృశ్యాలు అద్భుతంగా వుంటాయి.


 • ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నది.

  క్రీ.శ. 16 వ శతాబ్దానికి చెందిన ఈ మహల్ పెద్ద ప్రాంగణాన్ని కలిగి ఉంటుంది. సభా భవనాలు, అనేక టెర్రస్ కలిగి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నది. ఇక్కడ గల తోటలలో విహరిస్తూ, ఆనాటి కాలపు కళలను గుర్తుకు తెచ్చుకుంటూ మహల్ ను చుట్టిరావచ్చు. ఈ మహాల్ వెనకు ఒక కథ కూడ ఉంది అదేంటంటే..


 • అక్బర్ కామాగ్నిని ప్రజ్వరిల్లజేసిన ఆ మహిళ పేరు రూపమతి

  అక్బర్ కామాగ్నిని ప్రజ్వరిల్లజేసిన ఆ మహిళ పేరు రూపమతి. పేరుకు తగ్గట్టు అందాల రాశి. ఆమెలాంటి స్వఛ్ఛమైన దివ్యస్త్రీని వేల సంవత్సరాలకొకసారి గానీ భగవంతుడు సృష్టించడనీ పల్లెల్లో పట్నాల్లో జానపదులు పాడుకునేవారు. ఆగ్రా వీధుల్లో మారువేషంతో తిరుగుతుండగా ఒక రోజున ఆ కీర్తిగానం అక్బర్ చెవిన పడింది. విన్నది మొదలుకుని అంతటి అలౌకిక సౌందర్యవతిని అనుభవించి తీరాలన్న ఆరాటం అతడి ఊపిరి సలపనివ్వలేదు. ఆ అందాల భరిణె ఎక్కడున్నా సగౌరవంగా తీసుకురండి. నా చేత గొప్ప సన్మానాలు పొందమని చెప్పండి - అని రాజోద్యోగులను పురమాయించాడు.


 • రూపమతి మాళవ సుల్తాన్ బాజ్ బహదూర్ అంతఃపురంలో ఉన్నదని

  రూపమతి మాళవ సుల్తాన్ బాజ్ బహదూర్ అంతఃపురంలో ఉన్నదని, చక్రవర్తి పిలిచినా సరే ఆమె రాదనీ వారు వట్టి చేతులతో తిరిగొచ్చి చెప్పేసరికి అక్బర్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. రూపమతిని మర్యాదగా తనకు స్వాధీనపరచకపోతే మాళవ రాజ్యాన్ని ముట్టడించయినా సరే ఆమెను లాక్కురావాలని తనకు సన్నిహితుడైన ఆధంఖాన్ కు ఉత్తర్వు జారీ చేశాడు.


 • బాజ్ బహాదూర్ విలాసపురుషుడు. రూపమతిని వలచి, వలపించుకుని

  బాజ్ బహాదూర్ విలాసపురుషుడు. రూపమతిని వలచి, వలపించుకుని తన రాణిని చేసుకున్నాడు. ప్రాణ సమానంగా చూసుకుంటున్న నెచ్చెలిని మొగలులు అడగగానే అర్పించుకోవడానికి అతడు సహజంగానే ఇష్టపడలేదు. బాజ్ బహాదూర్ మొగలుల సవాలును వీరోచితంగానే స్వీకరించి సేనలను సన్నద్దం చేశాడు. ఒకవేళ తాము ఓడిపోతే మొగలుల చేతికి చిక్కకుండా అంతఃపుర స్త్రీలందరినీ చంపెయ్యమని నమ్మకస్తులైన వారిని నియోగించి అతడు యుద్దానికి కదిలాడు.


 • శత్రువులకు దక్కకుండా అంతఃపుర స్త్రీలను

  సారంగపూర్ దగ్గర జరిగిన భీకర సమరంలో మాళవ సేనలు హోరాహోరీగా పోరాడినా అంతిమ విజయం మొగలులకే దక్కింది. బాజ్ బహాదూర్ చేసేదిలేక ఖాందేశ్ కొండల్లోకి పారిపోయాడు. పరాజయం కబురు తెలియగానే కోట సంరక్షకులు తమకు అప్పగించిన పనికి ఉపక్రమించారు. శత్రువులకు దక్కకుండా అంతఃపుర స్త్రీలను కత్తులతో నరికేస్తూ రూపమతీని వేటు వేశారు. ఆమె గాయపడింది కాని ప్రాణం పోలేదు.


 • రూపమతి తానే విషం మింగి అక్బర్ కు అందకుండా

  అంతటి సౌందర్యరాశిని చంపేందుకు చేతులు రాకో, తొందరలో గమనించకో గాని ఆమెను మళ్ళీ పిడిచి చంపలేదు. సేవకులు ఆమెను కోటలో సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇంతలో వికటాట్టహాసంతో విరుచుకుపడ్డ ఆధంఖాన్ రూపమతి ఎక్కడున్నా వెతికి పట్టుకోమని సైనికులకు ఆదేశించాడు. ఆ సంగతి తెలిసి రూపమతి తానే విషం మింగి అక్బర్ కు అందకుండా పరలోకానికి పోయింది.


 • ఎలా చేరుకోవాలి

  రైల్వే మార్గం: మాండూకు సమీపంలో ఇండోర్‌ రైల్వేస్టేషన్‌ ఉంది. హైదరాబాద్‌, విజయవాడ నుంచి ఇండోర్‌కు రైళ్లు (వీక్లీ) అందుబాటులో ఉన్నాయి. ఇండోర్‌ నుంచి బస్సులు, ట్యాక్సీల్లో మాండూకు వెళ్లొచ్చు.
  భోపాల్‌ నుంచి మాండూ 288 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్టణం నుంచి భోపాల్‌కు రైలు సౌకర్యం ఎక్కువ. విమాన సర్వీసులూ అందుబాటులో ఉన్నాయి. భోపాల్‌ నుంచి ఇండోర్‌ మీదుగా మాండూ చేరుకోవచ్చు.
  విమాన మార్గం: విమానంలో వెళ్లే పనైతే.. హైదరాబాద్‌ నుంచి ఇండోర్‌కు నాన్‌స్టాప్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
వింధ్య పర్వత సానువుల్లో ఉన్న సుందర ప్రదేశం మాండూ. ఈ చారిత్రక నగరి మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ పట్టణం ఇండోర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తులో.. పచ్చని ప్రకృతితో అలరారుతోన్న మాండూ ఒకప్పుడు మాల్వా రాజ్యానికి రాజధానిగా ఉండేది. మాండూకు మరోపేరు 'ఆనంద నగరం'. కళలకు నెలవు, ప్రేమకు చిరునామా ఈ ప్రాంతం. మాండూ చివరి స్వతంత్ర రాజు బాజ్ బహద్దూర్, రాణి రూపమతి ప్రేమకు చిహ్నమైన రూపమతి మహల్ ఇందుకు ఉదాహరణ.