Back
Home » విహారం
శ్రీ కృష్ణ జన్మాష్టమిన ఉడిపిలోని శ్రీ కృష్ణుని దర్శన భాగ్యం పొందండి
Native Planet | 26th Aug, 2019 04:54 PM
 • ఉడిపి కృష్ణ మందిరం

  కర్ణాటకలోని ప్రసిద్ధ కృష్ణ మందిరాలలో ఒకటి. ఇది ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రదేశం. ఉడుపిని దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. ఉడుపిలో 13 వ శతాబ్దపు కృష్ణ ఆలయం ఉంది. శ్రీకృష్ణుడి పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు.


 • ఆలయం వెనుక భాగంలో ఉన్న కిటికీ నుంచి స్వామిని దర్శించుకోవడం

  కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి క్షేత్రంలో కొలువైన చిన్ని కృష్ణుని ఆలయం హిందువులకు పరమ పవిత్రమైన ప్రాంతం. మఠాధిపతులు తప్ప ఇతరులెవరికీ మూలమూర్తిని తాకే అవకాశం లేదు. ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్న కిటికీ నుంచి స్వామిని దర్శించుకోవడం ప్రత్యేకత.


 • ఉడిపిలోని శ్రీకృష్ణమఠంలో జన్మాష్టమిని మహావేడుకగా నిర్వహిస్తారు

  ఉడిపి (కర్ణాటక)లోని శ్రీకృష్ణమఠంలో జన్మాష్టమిని మహావేడుకగా నిర్వహిస్తారు. ద్వైతమత స్థాపకుడైన మధ్వాచార్యులవారు, ఇక్కడి మఠంలోని కృష్ణవిగ్రహాన్ని ప్రతిష్టించారట. అందుకని ఎక్కడెక్కడి వైష్ణవులో ఇక్కడి స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు.


 • ‘విట్టల్ పిండి' పేరుతో కృష్ణుని మట్టివిగ్రహాన్ని రూపొందించడం ఓ విశేషం

  ఇక్కడ,శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. జన్మాష్టమి సందర్భంగా 'విట్టల్ పిండి' పేరుతో కృష్ణుని మట్టివిగ్రహాన్ని రూపొందించడం ఓ విశేషం. ఆ విగ్రహాన్ని ఊరేగించిన తర్వాత ఆలయంలోని మధ్వసరోవరంలో నిమజ్జనం చేస్తారు.


 • అనంతేశ్వర మందిరం

  ఉడిపిలోని శ్రీ కృష్ణ మందిరం కర్ణాటకలో ఎక్కువగా సందర్శించే ప్రదేశాలలో ఒకటి. ఇక్కడే అనంతేశ్వర మందిరం కూడా సమీపంలో ఉంది. ఇది శివుడికి అంకితం చేసిన పుణ్యక్షేత్రం


 • ‘విట్టల్ పిండి’ ఉత్సవం:

  శ్రీ కృష్ణ జన్మాష్టమికి 15 రోజుల ముందు నుండి సన్నాహాలు జరుగుతాయి. డెజర్ట్ తయారీ ప్రక్రియ ముందుగానే ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆలయం మొత్తం అందంగా పువ్వులతో అలంకరించడం జరుగుతుంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే ఉత్సవం కనిపిస్తుంది.


 • ఉడిపిలో ప్రతి రెండు సంవత్సరాలకు

  ఉడిపిలో ప్రతి రెండు సంవత్సరాలకు ప్రత్యామ్నాయ పండుగ జరుగుతుంది. ఈ సందర్భంలో ఎనిమిది మఠాలలో ఈ మందిరం నిర్వహణ ఒకరు నుండి మరికొరికి ఇవ్వబడుతుంది.


 • ఉడిపి - చూడదగిన ప్రదేశాలు

  చంద్రేశ్వర, అనంతేశ్వర దేవాలయాలు, సెయింట్ మేరీస్ ఐలాండ్, అనెగుడ్డె వినాయక దేవాలయం, కొడి బీచ్, కుద్లు ఫాల్స్, ఇంద్రాణి పంచదుర్గ పరమేశ్వరి దేవాలయం, మట్టు బీచ్, బ్రహ్మి దుర్గ పరమేశ్వరి దేవాలయం, కుండేశ్వర దేవాలయం, బెల్కల్ తీర్థ ఫాల్స్.


 • బీచ్ మరియు లైట్ హౌస్

  ఉడుపిలోని దేవాలయాలతో పాటు, సెయింట్ మేరీస్ బీచ్, మణిపాలా ఎండ్ పాయింట్, కాపు లైట్ హౌస్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. ఒక వేళ మీరు కూడా ఈ ఉడిపి నగరం తిరగాలనుకుంటే, శ్రీకృష్ణ జన్మాష్టమి సమయంలో చాలా అద్భుతంగా..ఆధ్యాత్మిక వాతావారణంతో ఆహ్వానం పలుకుతుంది. ఉడిపి సందర్శించడానికి ఈ సమయం ఉత్తమ సందర్భం.


 • ఎలా చేరుకోవాలి

  మీరు ఉడిపికి ప్రయాణించాలనుకుంటే, ఉడిపి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగుళూరు విమానాశ్రయానికి చేరుకోవాలి. అక్కడి నుంచి ఉడిపి చేరుకోవడానికి బస్సు లేదా క్యాబ్ తీసుకోవచ్చు. ఇది మంగుళూరు నుండి ఉడిపికి 1 గంట ప్రయాణం.
శ్రీకృష్ణుడు హిందూమత దేవుడు. ఈయన శ్రీమహావిష్ణువు అవతారాలలో తొమ్మిదవ అవతారం. 'కృష్ణ' అనగా నలుపు అని అర్థం. అందుకే కృష్ణుడు అంటే నలుపు రంగు కలిగిఉన్నవాడని ఐతిహ్యం. అనేక దేవాలయాల విగ్రహాలలోనూ, శిల్పాలలోనూ, చిత్రాలలోనూ, ప్రార్థనలోనూ, సాహిత్యం, పురాణాలు, కావ్యాలు ఇలా అన్ని చోట్ల శ్రీకృష్ణుని రూప స్వభావాల చిత్రణ ఉన్నది.

కృష్ణాష్టమిని దేశం యావత్తూ తన ఇంట్లో పిల్లవాడి జన్మదినంగానే భావిస్తారు. కృష్ణుడిని అటు చిన్నికన్నయ్యలా భావిస్తూ, ఇటు దేవాధిదేవునిగా తలుస్తూ ఘనంగా జన్మాష్టమి వేడుకలు జరుపుకొంటారు. అయితే కొన్ని ఆలయాలలో జన్మాష్టమి, మరింత సంబరంగా సాగుతుంది. జీవితకాలంలో ఒక్కసారైనా ఆ వేడుకని చూడాలని హిందువులంతా పరితపించిపోతారు. అలాంటి కొన్ని ప్రత్యేకమైన ఆలయాలలో ఒకటి ఉడిపి.